అంతకంతకు హైప్ పెంచేస్తున్న నాగచైతన్య ‘కస్టడీ’

Published on Mar 4, 2023 3:00 am IST


అక్కినేని నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇటీవల నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ, థాంక్యూ సినిమాలు ఆకట్టుకున్నప్పటికీ అక్కినేని ఫ్యాన్స్ ఆయన నుండి మంచి మాస్ మూవీ కోరుకుంటున్నారు.

అయితే ఈ మూవీలో చైతన్య లుక్, పోస్టర్స్ ని బట్టి చూస్తే తాము కోరుకునే మాస్ అంశాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోందని, మూవీ రిలీజ్ తరువాత మంచి టాక్ దక్కించుకుంటే ఇది నాగచైతన్య కెరీర్ లో మంచి సక్సెస్ఫుల్ మూవీగా నిలుస్తుందని పలువురు అక్కినేని ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ప్రేమ జీ, అమరెన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా మే 12, 2023 న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్ల లో కస్టడీ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :