అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్రలో నాగ చైతన్య !
Published on Mar 11, 2018 9:52 am IST

నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహానటి’ చిత్రం రోజుకో ప్రత్యేకతను సంతరించుకుంటోంది. అలనాటి నటి సావిత్రిగారి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి ఇతర స్టార్ నటీ నటులు కూడా నటిస్తుండగా వాళ్ళ జాబితాలో నాగ చైతన్య కూడ చేరారు.

గత కొన్ని నెలలుగా వస్తున్న వార్తల్ని నిజం చేస్తూ ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్రను పోషించేందుకు చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. షూటింగ్ కోసం ఈ నెల 14, 15వ తేదీలను కేటాయించారట. ఇన్ని విశేషాలున్న ఈ చిత్రాన్ని మార్చి 21నాటికి పూర్తిచేయనున్నారు టీమ్. తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న, ప్రియాంక దత్ లు నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook