ఫోటో మొమెంట్ : ‘కస్టడీ’ సాంగ్ షూట్ లో నాగ చైతన్య, కృతి శెట్టి

Published on Feb 16, 2023 11:56 pm IST


అక్కినేని నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ కస్టడీ. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తుండగా మ్యాస్ట్రో ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందిస్తున్నారు. ఆకట్టుకునే కథ కథనాలతో దర్శకుడు వెంకట్ ప్రభు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని అంటోంది యూనిట్.

ఇక విషయం లోకి వెళితే, ఈ మూవీ కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన పలు భారీ సెట్స్ లో ప్రస్తుతం ఒక సాంగ్ ని గ్రాండ్ లెవెల్లో చిత్రీకరిస్తున్నారు. హీరో నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టి కలిసి చిందేస్తున్న ఈ సాంగ్ షూట్ సందర్భంగా టీమ్ అందరూ కలిసి ఒక పిక్ దిగారు. శేఖర్ మాస్టర్ సూపర్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ సాంగ్ లో నాగ చైతన్య, కృతి ఇద్దరూ కూడా ట్రెండీ స్టైల్ కాస్ట్యూమ్స్ తో అదరగొట్టారు. కాగా ఈ మూవీని వీలైనంత త్వరలో పూర్తి చేసి దీనిని వేసవి కానుకగా మే 12న విడుదల చేయనున్నారు. కాగా ఈ సాంగ్ షూట్ తాలూకు పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :