నారాయణగూడలో సందడి చేస్తున్న చైతు – సమంత

Published on Jun 12, 2013 7:00 pm IST

nagachaitanya-and-samantha
అక్కినేని నాగ చైతన్య, సమంత ‘మనం’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లెజెండ్ ఎఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నారాయణ గూడలో జరుగుతోంది. నాగార్జున ఈ సినిమాని ‘మేజికల్’ గా పిలుస్తారు. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ – నవంబర్ లో పూర్తి కావచ్చునని ప్రొడక్షన్ టీం భావిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాకి డైలాగ్స్ ని అందించిన హర్షవర్ధన్ ఈ సినిమాకి డైలాగ్స్ ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున సరసన శ్రియ, నాగ చైతన్య సరసన సమంతలు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :