ప్రమోషన్ల కోసం వినూత్నంగా ఆలోచిస్తున్న నాగ చైతన్య !


అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘యుద్ధం శరణం’. తమిళ దర్శకుడు, నాగ చైతన్యకు చిన్ననాటి స్నేహితుడు కృష్ణ ఆర్వి మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 8న రిలీజ్ కానుంది. విడుదలకు ఇంకొద్ది సమయం మాత్రమే ఉండటంతో టీమ్ ప్రమోషన్ల వేగం పెంచారు. ముఖ్యంగా నాగ చైతన్య ప్రమోషన్ల విషయంలో చాలా శ్రద్దగా ఉన్నట్టు తెలుస్తోంది.

అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్లు చేయాలనుకుంటున్నారట. ఈ మేరకు త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లి అభిమానులను, ప్రేక్షకులను కలవాలనుకుంటున్నాడట ఆయన. ఈ మేరకు టూర్ షెడ్యూల్ ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారట. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలను ప్రకటిస్తారట. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఇందులో చైతన్యకు జోడీగా లావణ్య త్రిపాఠి నటించనుంది.