ఈ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చైతు..!

Published on Mar 17, 2021 3:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో అక్కినేని నాగ చైతన్యకు ఒక స్పెషల్ గుర్తింపు ఉందని చెప్పాలి. రోల్ ఎలాంటిది అయినా ఆ రోల్ కు సరిగ్గా సెట్టయి సెటిల్డ్ పెర్ఫామెన్స్ ను ఇచ్చే అతి తక్కువ మంది నటుల్లో చైతూ కూడా ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇదిలా ఉండగా చైతు తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.

దీనితో గత కొన్నాళ్ల నుంచి తన బాలీవుడ్ ఎంట్రీ పై కూడా పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనితో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వైరల్ అవుతుంది. లేటెస్ట్ గా అక్కడి మరో స్టార్ బాలీవుడ్ దర్శకురాలితో కలిసి చైతు తీసుకున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఆమె మరెవరో కాదు షారుఖ్ ఖాన్ తో ఓం శాంతి ఓం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన ఫరాహ్ ఖాన్.

తనతో కలిసి ఓ యాడ్ షూట్ నిమిత్తం చైతు కలిసి ఉన్న ఫోటో షేర్ చేసాడు. ఇది మంచి వైరల్ అవుతుంది. అయితే చైతు ఈమె డైరెక్షన్ లోనే ఆ యాడ్ షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. మరి ఇప్పుడిప్పుడే చైతు అడుగు అటు కూడా పడుతుంది మరి ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :