స్మూత్‌గా ఫినిష్ చేసిన నాగ చైతన్య

Published on May 7, 2021 10:01 pm IST

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో టాలీవుడ్లోని అని సినిమాలు ఆగిపోయాయి. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అందరు హీరోలు ప్యాకప్ చెప్పేశారు. ‘పుష్ప, శ్యామ్ సింగ రాయ్’ లాంటి చిత్రాలే సెట్స్ మీద ఉంటూ వచ్చాయి. వాటిలో కూడ ‘పుష్ప’ షూటింగ్ బన్నీకి వైరస్ సోకడంతో ఆగిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇండియాలో షూటింగ్ చేయడం రిస్క్ అని తేలిపోయింది. కానీ నాగ చైతన్య ‘థాంక్యూ’ టీమ్ మాత్రం అనుకున్నట్టే షెడ్యూల్ కంప్లీట్ చేసింది.

కేసులు పెరుగుతున్న సమయంలోనే టీమ్ ఇటలీ వెళ్ళింది. నాగ చైతన్య, రాశీఖన్నా, ఇతర ముఖ్య తారాగణం ఇటలీ వెళ్లి షూటింగ్లో పాల్గొన్నారు. తాజాగా షెడ్యూల్ ముగిసింది. టీమ్ మొత్తం ఎలాంటి ఇబ్బందీ లేకుండా చిత్రీకరణ చేశారు. అంటే ఆందోళకర సమయంలో కూడ చైతన్య స్మూత్‌గా షెడ్యూల్ ఫినిష్ చేశాడన్నమాట. ఇక తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్లో ప్లాన్ చేశారు. ఇది మాత్రం జూలై నెలలో జరుగుతుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వచిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :