చైతు ‘లవ్ స్టోరీ’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Oct 24, 2020 6:06 pm IST

అక్కినేని నాగచైతన్య హీరోగా చేస్తోన్న ‘లవ్ స్టోరీ’ డబ్బింగ్ ఈ రోజు మొదలైందని.. ముందుగా చైతు తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారని.. అయితే చైతు క్యారెక్టర్ ప్రకారం తెలంగాణ స్లాంగ్ లో చైతు మాడ్యులేషన్ ఉంటుందని తెలుస్తోంది. మరో వారం రోజులు పాటు చైతు డబ్బింగ్ ఉంటుందట.. ఆ తరువాత మిగిలిన కీలక క్యారెక్టర్స్ డబ్బింగ్ వర్క్ మొదలవుతుందట. ఇప్పటికే సాయిపల్లవి కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి వచ్చే నెల రెండో వారం కల్లా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయట. ఇక శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ చైతు – సాయిపల్లవి లాంటి క్రేజీ కాంబినేషన్ తో మరో వినూత్నమైన ప్రేమ కథగా ఈ సినిమాని తీసుకురాబోతుండటంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

పైగా మజిలీ, వెంకీమామ లాంటి సూపర్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న నాగచైతన్య ఈ సినిమాలో హీరో కావడంతో ఈ సినిమా కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నాయి. జీ5తో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ కూడా ఈ సినిమాకి ఉన్న మార్కెట్ కంటే కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేస్తోందని.. నిర్మాతలు మాత్రం థియేటర్ రిలీజ్ కోసం ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తోంది. ఏమైనా, బలమైన ఎమోషనల్ కథలతో సినిమాలు చేసే శేఖర్ కమ్ములతో పాటు చైతు, సాయి పల్లవి ముగ్గరు సూపర్ సక్సెస్ లో ఉండటం ఈ సినిమాకి బాగా కలసిరానుంది. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుండటం విశేషం.

సంబంధిత సమాచారం :

More