
సినిమా ఎంత పెద్దదైనా ప్రీ రిలీజ్ క్రేజ్ మాత్రం కొన్ని సినిమాలకే ఉంటుంది. ప్రస్తుతం అలాంటి క్రేజ్ అక్కినేని ఫ్యామిలీ హీరో ‘మనం’కి ఉంది. లెజండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ మరింత ఎక్కువైంది.
ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన నాగ చైతన్య బాగా ఎగ్జైట్ గా ఉన్నాడు. ‘ఇప్పుడే మనం ఫస్ట్ కాపీ చూసాను. ప్రపంచంలోనే బెస్ట్ ఫీలింగ్ ఇది. కొన్ని సీన్స్ మిమ్మల్ని ప్రతి రోజూ గుర్తుకు తెచ్చుకునేలా చేస్తాయి. విక్రమ్, అనూప్, పిఎస్ వినోద్, అన్నపూర్ణ ఫ్యామిలీ ఇలా మనం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా థాంక్స్ చెబుతున్నాను. మనం 23న కలుద్దాం అని’ నాగ చైతన్య ట్వీట్ చేసాడు.

