నాని డైరెక్టర్ తో నాగ చైతన్య !
Published on Nov 9, 2017 3:20 pm IST

‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విరించి వర్మ ఆ సినిమా తరువాత నానితో ‘మజ్ను’ సినిమా తీసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ అక్కినేని హీరోతో సినిమా చెయ్యడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ బ్యానర్ లో అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం నాగ చైతన్య ‘కార్తికేయ’ ‘ప్రేమమ్’ డైరెక్టర్ చందు మొండేటి తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత విరించి వర్మ దర్శకత్వంలో మరో సినిమా చెయ్యడానికి అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. వరుసగా సినిమాలు చేస్తూ పోతున్న చైతూ ఈ సినిమాతో మరింత మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.

 
Like us on Facebook