నాగ శౌర్యకు ఇది మంచి పరిణామమే !

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన ‘ఛలో’ చిత్రం రేపే రిలీజ్ కానుంది. మంచి ప్రీ రిలీజ్ క్రేజ్ తో వస్తునం ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందిస్తుందని శౌర్య ధీమాగా ఉన్నారు. అంతేగాక ఈ చిత్రం ఓవర్సీస్లో కూడా మంచి స్థాయిలోనే రిలీజ్ కానుంది. సుమారు 109 స్క్రీన్లలో సినిమాను ప్రదర్శించనున్నారు. ఈరోజు రాత్రి నుండే ప్రీమియర్లు పడనున్నాయి.

ఈ విడుదలతో నాగ శౌర్యకు మంచో స్థాయిలోనే ఓవర్సీస్ మార్కెట్ క్రియేట్ కానుంది. విభిన్నమైన ప్రయత్నాలకు అక్కడి తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణ ఉండటం వలన సినిమా బాగుంటే వసూళ్లు కూడా మంచి స్థాయిలోనే ఉండనున్నాయి. నూతన దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శౌర్య తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై నిర్మించారు.