నాగశౌర్య కొత్త సినిమా రేపు లాంచ్ కానుంది !

Published on May 10, 2019 8:02 pm IST

ఇటీవల వరస పరాజయాలతో సతమతమవుతున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. గత ఏడాది ప్రారంభంలో ఛలో తో హిట్ కొట్టిన శౌర్య ఆ తరువాత వరుసగా మూడు పరాజయాలను చవి చూశాడు. ఇక ఇప్పుడు ఈ హీరో శ్రీనివాస్ అవసరాల తో ఓ సినిమా చేస్తుండగా తాజాగా నూతన దర్శకుడు రమణ తేజ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రేపు ఈ చిత్రం లాంచ్ కానుంది.

నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మించనున్న ఈచిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటించనుంది. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదలకానుంది. మరి ఈరెండు చిత్రాలతోనైనా శౌర్య గాడిలో పడతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More