నాగబాబు కుమార్తె నిహారిక వివాహ వేడుకలు రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మెగా కుటుంబాలన్నీ హాజరయ్యాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, శిరీష్, వైష్ణవ తేజ్, సాయి తేజ్ అంతా కలిసి వేడుకల్లో ఖుషీ నింపుతున్నారు. కుటుంబ సభ్యులంతా నిన్నటి నుండి అక్కడే ఉండగా పవన్ మాత్రం ఈరోజు సాయంత్రానికి వేడుకకు వెళ్లారు.
నిన్నటి నుండి నాగబాబు పవన్ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. చిన్న తమ్ముడు కూడ వచ్చేస్తే వేడుక మరింత అందంగా ఉంటుందని భావించారు. ఆశించినట్టే పవన్ వేడుకకు వెళ్లారు. దీంతో నాగబాబు సూపర్ హ్యాపీ అయిపోయారు. ఈ ఆనందమైన క్షణాలను పరిపూర్ణం చేయడానికి ఆ ఆఖరి సంతోషం కూడ వచ్చేసింది అంటూ తమ్ముడితో కలిసున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక పవన్ తో పాటు ఆయన కుమారుడు అఖీరా నందన్ కూడా వేడుకకు హాజరయ్యాడు. చైతన్యతో నిహారిక వివాహం రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది.


