
అక్కినేని హీరోలైన నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ లు వరుసగా తమ సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అక్టోబర్ 22న రిలీజ్ కావాల్సిన అఖిల్ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ ఫినిష్ కాకపోవడం వలన నవంబర్ కి వాయిదా వేసారు. ఇది పక్కన పెడితే నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఈ చిత్ర టీం ఈ సినిమాని త్వరలోనే ఫినిష్ చేసి నాగార్జునకి లక్కీ అయిన డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
అలాగే నాగ చైతన్య – గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సాహసమే శ్వాసగా సాగిపో’. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది. ఈ నెలాఖరు కల్లా ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసి నవంబర్ లో ఆడియోని రిలీజ్ చేసి డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అనగా డిసెంబర్ లో అటు ఇటుగా నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా, నాగ చైతన్య సాహసమే శ్వాసగా సాగిపో సినిమాలు డిసెంబర్ లోనే థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. రానున్న రెండు నెలల్లో అక్కినేని అభిమానులు పండగ చేసుకునే సినిమాలు వరుసగా రిలీజ్ కానున్నాయి.

