హిమాలయాల ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న నాగ్

Published on Oct 30, 2020 1:37 am IST


అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం హిమాలయాల్లో ఉన్నారు. కఠినమైన చలి ప్రాంతమే అయినా ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నానని, ఈ ఫ్రీడమ్ నచ్చిందని చెప్పుకొచ్చారు నాగ్. హిమాలయాల్లో బృందంతో కలిసి చిత్రీకరణ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగార్జున తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. కోవిద్ నిబంధనలు సడలించడంతో కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ‘బిగ్ బాస్’ కార్యక్రమాన్ని సైతం పక్కనపెట్టి షూట్లో జాయిన్ అయ్యారు నాగార్జున.

సుమారు నెలరోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం పూర్తికానుంది. ఈ మంచు ప్రాంతాల్లో జరిగే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో నాగ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ఐఏ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇది నాగర్జున గతంలో చేసిన యాక్షన్ చిత్రాలకంటే భిన్నంగా ఉంటుందట. ఇందులో బాలీవుడ్ బ్యూటీలు సయామీ ఖేర్, దియా మీర్జాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More