నాగార్జున, వర్మ సాహసం చేస్తున్నారా?
Published on Mar 1, 2018 11:51 am IST

రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో చేస్తోన్న నాలుగవ సినిమా ఆఫీసర్. నాగార్జున ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్శనమివ్వబోతున్నాడు. మే 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో పాటలు ఉండబోవని తెలుస్తోంది. సినిమా నిడివి గంట నలభై ఐదు నిమిషాలు ఉండబోతోందని చెబుతున్నారు. పాటలు లేకుండా, అంతతక్కువ నిడివితో సినిమా విడుదల చెయ్యడం అంటే సాహసమనే చెప్పాలి.

మైరా సరీన్ అనే నూతన హీరోయిన్ నాగార్జున సరసన నటిస్తోంది. షూటింగ్ ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరోవైపు జరుపుకుంటున్న ఈ సినిమాను పక్కా స్క్రిప్ట్ తో తెరకేక్కిస్తున్నాడు వర్మ. నాగార్జున నానితో చేసే మల్టిస్టారర్ సినిమాలో నటించాలి కాని ఆఫీసర్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరుకు వేరే సినిమాపై పోకస్ చెయ్యడం లేదు నాగార్జున.

 
Like us on Facebook