‘రాజుగారి గది-2’ కి ప్రాణంలా మారిన నాగార్జున !
Published on Oct 15, 2017 10:15 am IST

ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాజుగారి గది-2’ చిత్రం గత శుక్రవారం విడుదలైన సంగతి తెల్సిందే. మొదటి రోజు కాస్తంత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున చరీష్మ వలన బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటోంది. నాగార్జున చేసిన మెంటలిస్ట్ పాత్ర సినిమాకు హైలెట్ గా నిలవడం, ఫస్టాఫ్ నుండి చివరి వరకు సినిమా మొత్తం నాగార్జున ద్వారానే నడవడంతో ఆయన అభిమానుల్లో సినిమా పట్ల ఆదరణ పెరుగుతోంది.

దానికి తోడు నాగ్ కూడా స్టైలిష్ గా కనిపిస్తుండటం, స్టార్ హీరోయిన్ సమంత పెర్ఫార్మెన్స్ కూడా బాగుండటం వంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక వచ్చే శుక్రవారం వరకు థియేటర్లలో ఉన్న పెద్ద సినిమా ఇదే కావడం మరొక ప్లస్ పాయింట్ అనొచ్చు. మరి ఫుల్ రన్ మొత్తం పూర్తయ్యే లోపల సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. పివిపి, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

 
Like us on Facebook