కుమారుల కెరీర్ కోసం నాగార్జున కొత్త స్ట్రాటజీ!

కుమారుల కెరీర్ కోసం నాగార్జున కొత్త స్ట్రాటజీ!

Published on Nov 24, 2015 1:04 AM IST

nagarjuna-akhil
తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సినీ పరిశ్రమకు రెండు కళ్ళలో ఒక కన్నుగా పిలవబడుతూ, ఎంతో కృషి చేసిన అక్కినేని నాగేశ్వర రావుతో మొదలైన ఈ ప్రస్థానం ఆ తర్వాత నాగార్జున, నాగ చైతన్యలతో సాగుతూ వస్తోంది. ఇక ఈ మధ్యే ఇదే ఫ్యామిలీ నుంచి అక్కినేని అఖిల్ సైతం ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ చూపే ప్రయత్నం చేశారు. ‘అఖిల్’ సినిమాతో అఖిల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసినా అఖిల్‌కు మాత్రం ఎంతో కొంత పేరు తెచ్చిపెట్టింది.

ఇక అఖిల్ మొదటి సినిమా పరాజయం కావడంతో నాగార్జున ఇకపై అఖిల్ కెరీర్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇప్పటికే మంచి ఫాలోయింగ్‌తో దూసుకుపోతోన్న నాగ చైతన్య కెరీర్ పట్ల కూడా ప్రత్యేకంగా నాగార్జున చర్యలు చేపట్టాలనుకుంటున్నారట. ఇప్పటివరకూ కుమారుల సినిమాల కథల విషయంలో జోక్యం చేసుకోని నాగ్, ఇకపై వారి కథల ఎంపికలో తన అనుభవంతో సలహాలు, సూచనలు చేసే దిశగా ఆలోచిస్తున్నారట. ఇక దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో ఉండి, కథల ఎంపికలో కొత్తదనం చూపించే నాగార్జున తన కుమారుల విషయంలో ఇలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే ఆలోచన చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు