దర్శకుడికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్న నాగ్

Published on May 28, 2021 3:00 am IST

కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కొత్త సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ‘వైల్డ్ డాగ్’ విడుదలకు రెడీ అవుతుండగానే ఈ సినిమాను ప్రకటించారు ఆయన. ఇది కూడ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా షూటింగ్ మొదలై వేగం పుంజుకునే సమయానికి లాక్ డౌన్ పడటంతో నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతుండటంతో త్వరలోనే నిబంధనలు సడలింపు ఉంటుంది. దీంతో జూన్ మొదటి వారం నుండి చిత్రీకరణ రీస్టార్ట్ చేయనున్నారు.

ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ నందు ప్రత్యేకమైన సెట్ రెడీ చేస్తున్నారు టీమ్. ఎలాంటి కుదింపులు లేకుండా అవసరమైనంత మంది బృందంతోనే షూటింగ్ జరపనున్నారు. ఇందుకోసం అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు తీసుకోనున్నారు. నాగార్జున సైతం అన్ని రకాలుగా దర్శకుడిని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు. ఇందులో నాగార్జునకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కాజల్, నాగ్ కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :