నాగ్, నానిలో సినిమా మొదలయ్యేది అప్పుడే !
Published on Mar 13, 2018 1:14 am IST

నాగార్జున, నాని మల్టి స్టారర్ సినిమా ఈ మార్చి నెల 18వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. ఇటీవలే ఈ సినిమా రీ రికార్డింగ్ ప్రారంభం అయ్యింది. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినిదత్ నిర్మిస్తున్నారు. ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో వహిస్తోన్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు.

నాగార్జున డాన్ గా, నాని డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. కామెడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి సంభందించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడి కాబోతున్నాయి. నాగార్జున ప్రస్తుతం ‘ఆఫీసర్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మే 25 న ఈ సినిమా విడుదల కానుంది. ఇక నాని చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ ఏప్రిల్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook