గాంధీ జయంతి కానుకగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘స్వచ్చ భారత్ అభియాన్’ కార్యక్రమానికి దేశ నలుమూల నుండి మచ్న్హి రెస్పాన్స్ వస్తోంది. మన రాష్ట్రాల్లో కూడా ఊపందుకోవడమే కాకుండా టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ స్వచ్చ భారత్ లో జోరుగా పాల్గొని పలువురికి స్పూర్తిని ఇస్తున్నారు. రిలయన్స్ అధినేత అనీల్ అంబానీ కొద్ది రోజుల క్రితం కింగ్ నాగార్జునని స్వచ్ఛ భారత్ అభియాన్ కి నామినేట్ చేసారు.
ఇందులో భాగంగా నాగార్జున, అయన కుటుంబ సభ్యులు ఈ రోజు హైదరాబాద్ లో స్వచ్చ భారత్ లో పాల్గొని ఒక ఏరియాని క్లీన్ చేసారు. ఆ తర్వాత రాష్ట్రాని క్లీన్ గా ఉంచడంలో తమ వంతు బాధ్యతని తప్పక నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేసారు. ఆ తర్వాత నాగార్జున ఈ స్వచ్చ భారత్ అభియాన్ లో పాల్గొనాలని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ స్టార్ హీరో సుధీప్ లకు చాలెంజ్ చేసారు. మరి ఈ విషయంలో మన స్టార్ హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


