ఆగ‌స్ట్ 4 నుంచి ‘నాగ్’ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మొదలు !

Published on Aug 2, 2021 7:06 pm IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాబోతున్న హై రేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సెకండ్ షెడ్యూల్ బుధవారం అనగా ఆగ‌స్ట్ 4 నుంచి హైద‌రాబాద్‌ లో స్టార్ట్ కానుంది. ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాలు, విదేశాల్లో కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా కాజల్ ఈ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించనుంది.

అలాగే నాగార్జున కూడా ఈ చిత్రంలో ఔట్ అండ్ ఔట్‌ యాక్ష‌న్ ప్యాక్డ్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. ఇక గుల్ ప‌నాంగ్‌, అనైకా సురేంద్ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ముకేశ్.జి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి బ్ర‌హ్మ క‌డ‌లి ఆర్ట్‌, రాబిన్ సుబ్బు, న‌భా మాస్ట‌ర్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్స్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇక కాజల్ పాత్ర విషయానికి వస్తే.. ఆమె ఒక ‘రా ఆఫీసర్’గా నటిస్తోందట. ఈ సినిమా కోసం కాజల్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా పాల్గొనాల్సి ఉంటుందట.

సంబంధిత సమాచారం :