నానితో మల్టీ స్టార్ పై క్లేరిటి ఇచ్చిన నాగ్!
Published on Oct 3, 2017 12:48 pm IST


వైజయంతీ మూవీస్ బ్యానర్ లో శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కలిసి మల్టీ స్టార్ మూవీ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద నిర్మాత అశ్వనిదత్ కూడా క్లేరిటి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ విషయం మీద నాగార్జున క్లేరిటి ఇచ్చాడు. నాని కాంబినేషన్ లో మల్టీ స్టార్ చేస్తున్నా అని, శ్రీ రామ్ ఆదిత్య చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో చేయడానికి అంగీకరించినట్లు తెలిపారు.

ఈ సినిమాలో నాని ఫుల్ ఫన్ జెనరేట్ చేసే పాత్ర చేస్తున్నాడని, తన పాత్ర కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందని నాగార్జున అన్నాడు. ఇప్పటికే శ్రీ రామ్ ఆదిత్య భలే మంచి రోజు తో మంచి హిట్ కొట్టి, శమంతకమణితో కుర్ర హీరోలతో మల్టీ స్టార్ ని తెరకెక్కించి మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సారి ఏకంగా నేచురల్ స్టార్, నాగార్జునతో భారీ స్థాయిలో మల్టీ స్టార్ సెట్ చేసేసాడు. మరి ఈ సినిమా ఎ రేంజ్ లో ఆడియన్స్ ని ఫిదా చేస్తుందో చూడాలి.

 
Like us on Facebook