ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా.. ఆ ఇద్దరికి నాగ్ క్లాస్..!

Published on Nov 20, 2021 7:03 pm IST


బిగ్‌బాస్ సీజన్ 5 దాదాపు ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో సిరి, షణ్ముఖ్‌ మధ్య ఏదో మొదలయ్యిందన్న ఊహాగానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల షణ్ముఖ్ సిరిపై కోపడడంతో దానిని తట్టుకోలేకపోయిన సిరి బాత్రూంలో తల బాదుకుని తనను తాను గాయపర్చుకుంది. సిరి అలా చేయడంతో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం షాక్‌కి గురయ్యారు. దీంతో వారిద్దరి వ్యవహారాన్ని తేల్చేందుకు నాగ్ సిద్దమయ్యాడు. ఇద్దరిని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి క్లాస్‌ తీసుకున్నాడు.

నిన్ను నువ్వు ఎందుకు గాయపరుచుకున్నావు అని సిరిని ప్రశ్నిస్తూ ‘ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా’ అని మండిపడ్డాడు. ఏం జరుగుతుంది అని అడగ్గా.. ఏమో సార్ నాకు కూడా క్లారిటీ లేదని చెప్తూ సిరి ఏడ్చేసింది. కోట్లమంది నిన్నుచూసి ఇలా ఉండాలని నేర్చుకోవాలి, అంతేకానీ అయ్యో ఇలా మాత్రం ఉండకూడదని అనుకోకూడదు కదా అని నాగ అనగా, నా స్టోరీ నాకు తెలుసు. బయట నేనేంటో తెలుసు. అయినా నాకు ఎందుకు షణ్నుతో కనెక్షన్ వస్తుందో నాకు తెలియట్లేదని చెప్పింది.

ఇక ఇదే విషయమై నాగ్ షణ్ముఖ్‌ను ప్రశ్నించగా.. ఏమో సార్ ‘మెంటల్‌గా చాలా వీక్‌ అయిపోయాను’ సర్‌ అని అన్నాడు. ఎందుకు దీప్తిని అంత మిస్ అవుతున్నావా అని అడగ్గా.. చాలా మిస్‌ అవుతున్నా సర్‌ అని షణ్ను సమాధానమిచ్చాడు. అంతలా మిస్‌ అవుతుంటే ఈ క్షణమే హౌస్ నుంచి వెళ్లిపో అంటూ నాగ్ బిగ్‌బాస్‌ ఇంటి గేట్లు తెరిపించాడు. మరి షణ్ముఖ్ నిజంగా హౌస్ నుంచి వెళ్లిపోయేందుకు సిద్దమవుతాడా? లేక వారిద్దరికి నాగ్ ఏవైవా సలహాలు ఇచ్చి సైలెంట్ చేస్తాడా? అనేది తెలియాలంటే ఈ రోజు జరిగే ఎపిసోడ్‌ను చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

More