‘నిన్నే పెళ్లాడతా’ లోగోతో నాగార్జున !

Published on Jul 19, 2019 8:05 pm IST

గతంలో కింగ్ నాగార్జున, టబు నటించిన ‘‘నిన్నే పెళ్లాడతా’’ చిత్రం సూపర్ హిట్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం విదితమే. అదే టైటిల్‌ తో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాల పై బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర లోగో‌ని కింగ్ అక్కినేని నాగార్జున గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వైకుంఠ బోను మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర లోగోని ఆవిష్కరించిన మా మన్మథుడు, కింగ్ నాగార్జునగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆయన హిట్ చిత్రo ‘నిన్నే పెళ్లాడతా’ టైటిల్‌ను, ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మాకు సంతోషంగా ఉంది. ఇప్పటికే 50 శాతంకు పైగా షూటింగ్ పూర్తయింది అని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: నవనీత్, ఎడిటర్: అనకాల లోకేష్, నిర్మాతలు: బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు, కథ – స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: వైకుంఠ బోను.

సంబంధిత సమాచారం :