హాట్ టాపిక్ గా మారిన నమ్రత కం బ్యాక్..!

Published on Jul 2, 2020 2:04 am IST


మన తెలుగు హీరోలను తమ అభిమానులు ఎంతలా ఆరాధిస్తారో వారి జీవిత భాగస్వామి ని కూడా అంతే స్థాయిలో గౌరవిస్తారు. అలాంటి జంటలో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రత ల జంట కూడా ఒకటి. అయితే నమ్రత మొట్టమొదటి సారిగా మహేష్ తోనే వంశీ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

అలా మొదలైన వారి ప్రేమ వివాహానికి దారి తీసి వీరి జంట ఎంతో అన్యోన్యంగా మారింది. అయితే ఎప్పుడో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన నమ్రత సోషల్ మీడియాలో తాను మళ్ళీ ఎప్పుడు స్క్రీన్ పై కనిపిస్తానో అందులోనూ మహేష్ తో కలిసి నటిస్తానో తెలీదు అని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఒక్క సినీ వర్గాల్లోనే కాకుండా మహేష్ అభిమానుల్లో మంచి హాట్ టాపిక్ అయ్యింది.

దీనితో ఇప్పుడు నమ్రత కం బ్యాక్ ఎప్పుడెప్పుడా అని మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం నమ్రత కుటుంబ భాద్యతలలో బిజీ గా ఉన్నారు. వీలు చూసుకొని మహేష్ తో ఓ సినిమాలో కనిపించినట్టైతే ఆమెకు ఒక మంచి కం బ్యాక్ చిత్రం లానే కాకుండా మహేష్ ఫ్యాన్స్ కు ట్రీట్ లా కూడా నిలిచిపోతుంది.

సంబంధిత సమాచారం :

More