తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు నిన్న అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబీకులు సహా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అలాగే టాలీవుడ్ నుంచి ఎందరో బిగ్ స్టార్స్ ఈ వేడుకలకి వెళ్లగా అందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు.
మరి చరణ్ ఇచ్చిన స్పీచ్ తో అయితే నందమూరి ఫ్యాన్స్ తన పట్ల మరింత గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నారు. చరణ్ ఆ మహనీయుని కోసం ఇంత చక్కగా మాట్లాడుతాడని ఊహించలేదని పైగా తన స్పీచ్ ముగించిన సమయంలో “జై ఎన్టీఆర్” అంటూ కూడా ముగించడం ఏదైతే ఉందో దానితో నందమూరి కుటుంబాన్ని అభిమానించే అందరి హృదయాలను చరణ్ గెలుచుకున్నాడు. దీనితో సోషల్ మీడియాలో చరణ్ స్పీచ్ పై అయితే నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ చరణ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
