నాని 24 షూటింగ్ ఆసల్యంగా ప్రారంభం కానుంది !

Published on Feb 17, 2019 6:23 pm IST


నాని ‘జెర్సీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసి తన కొత్త చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని తన 24 వ చిత్రం లో నటించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈనెల 19న ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదాపడిందని సమాచారం. ఈ చిత్రంలో నాని డిఫ్రెంట్ ఏజ్ గ్రూప్స్ వున్న పాత్రల్లో నటించాల్సి వుంది. అందుకోసం ప్రొస్థెటిక్ మేకప్ ను ధరించాల్సి వుంది. కానీ మేకర్స్ ఆలా కాకుండా ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కోసం వేరే వారిని వెతికే పనిలో ఉన్నారట అందుకే సినిమా షూటింగ్ ఆలస్యం కానుందట. త్వరలోనే షూటింగ్ తేదీని ప్రకటించనున్నారు. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ సుమారు 50కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారట.

ఇక ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ , ప్రియా ప్రకాష్ వారియర్ , మేఘా ఆకాష్ కథానాయికలుగా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :