నాని కొత్త సినిమా పాటల రికార్డింగ్ పూర్తి

నాని కొత్త సినిమా పాటల రికార్డింగ్ పూర్తి

Published on May 19, 2015 8:37 PM IST

nani
తన సహజమైన నటనతో, మంచి టైమింగ్ ఉన్న డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరో నాని. గత కొంతకాలంగా తనను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసే హిట్ కోసం ఎదురుచూసిన నాని, ఈమధ్యే విడుదలైన ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాల ద్వారా మంచి కమర్షియల్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో నాని దర్శకుడు మారుతీతో ‘భలే భలే మగాడివోయ్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ‘అందాల రాక్షసి’ సినిమాతో ఓ అందమైన ప్రేమకథను అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో నాని ఓ సినిమాను అంగీకరించిన విషయం తెలిసిందే. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ‘భలే భలే మగాడివోయ్’ షూటింగ్ పూర్తి కాగానే నాని ఈ సినిమాను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ కూడా పూర్తైనట్లు దర్శకుడు హను తెలియజేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వంలో రూపొందే ఈ ఆల్బమ్‌లోని పాటలన్నీ మంచి రిఫ్రెషింగ్ ఫీల్‌ని ఇస్తాయని దర్శకుడు తెలిపారు.

తాజా వార్తలు