సంక్రాంతి రోజే సినిమా పూర్తిచేసిన నాని

Published on Jan 15, 2020 11:24 am IST

నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ వయలెన్స్ బేస్డ్ మూవీగా ఉండనుంది. ఈ సినిమా చిత్రీకరణకు ఈరోజే చివరి రోజు. ఈ విషయాన్నే ప్రస్తావించిన నాని సంక్రాంతి రోజు సినిమాను ముగిస్తున్నాము అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇకపోతే ఈ సినిమాలో సుధీర్ బాబు, నివేత థామస్, అధితిరావ్ హైదరిలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదలకానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More