ఎన్టీఆర్ పాత్రలో నాని ?

యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ పేరుతో సావిత్రి జీవితం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆఖరి దశ షూటింగ్లో ఉన్న ఈ చిత్రంలో ఇప్పటికే జెమినీ గణేశన్ పాత్ర కోసం దుల్కర్ సల్మాన్, ఎస్వీ రంగారావు పాత్ర కొరకు మోహన్ బాబు, దర్శకుడు కెవి. రెడ్డి పాత్రలో దర్శకుడు క్రిష్, సింగీతం శ్రీనివాస రావ్ గా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ వంటి వారిని ఎంపికచేయగా ఇప్పుడు ఎన్టీఆర్ రోల్ కోసం నాని పేరు ప్రస్తావనకు వచ్చింది.

దర్శక నిర్మాతలు ఎన్టీఆర్ పాత్ర కోసం నానిని సంప్రదించాలని అనుకుంటున్నారట. మరి నాని ఈ ఆఫర్ ను ఒప్పుకుంటారా లేదో చూడాలి. ఇకపోతే ఇందులో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా జెమినీ గణేశన్ గా దుల్కర్ సల్మాన్, సమంత, షాలిని పాండేలు పలు కీలక పాత్రల్లోనూ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మార్చి 29న చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.