పిల్లలతో ఆడుకుంటున్న దర్శకుడు,ఆందోళనలో నాని.

Published on Jul 26, 2019 2:44 pm IST

గ్యాంగ్ లీడర్ సెట్స్ లో దర్శకుడు చేస్తున్న చర్యలు హీరో నానిని కంగారును గురిచేస్తున్నాయట. ఆయన పని పై ధ్యాసపెట్టకుండా చిన్న పిల్లతో ఆడుకుంటున్నారన్నదే నాని బాధ. ఐతే ఇదంతా సీరియస్ గా కాదు లెండి. హీరో నాని ట్విట్టర్ వేదికగా తన ఫ్యాన్స్ కి ఓ వీడియో ద్వారా కొంచెం హాస్యం పంచారు. అసలు విషయం ఏమిటంటే ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో ఓ పదేళ్ల పదేళ్ల లోపు వయసు కలిగిన పాప నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ సెట్స్ లో విక్రమ్ కుమార్ ఆ పాప చెవుతున్న ఫన్నీ ట్రిక్ ప్రాక్టీస్ చేస్తూ వర్క్ నుండి కొంచెం ఉపశమనం పొందుతున్న వీడియోని ట్విట్టర్ లో నాని పోస్ట్ చేశారు. అంతే కాకుండా “మా డైరెక్టర్ విక్రమ్ కుమార్ సెట్స్ లో చేస్తున్న పని ఇదండీ…,నేనిప్పుడు భయపడాలేమో” అని ఓ ఫన్నీ కామెంట్ కూడా పెట్టారు.

‘గ్యాంగ్ లీడర్, లో నాని రివేంజ్ స్టోరీలు రాసే పెన్సిల్ అనే పెన్ నేమ్ కలిగిన రైటర్ గా నటిస్తున్నారు. హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. యంగ్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :