నాని లేడీ గ్యాంగ్, ప్రతీకారం ఎవరిపై?

Published on Jul 16, 2019 7:14 am IST

నాచురల్ స్టార్ నాని నాని “గ్యాంగ్ లీడర్” ద్వారా మరో విభిన్నమైన చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైపోయినట్లున్నారు. ఇటీవల “గ్యాంగ్ లీడర్” మూవీ ప్రీ లుక్ రివీల్ చేసిన నాని, నిన్న ఫస్ట్ లుక్ ని ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

నానితో పాటున్న ఐదుగురు అమ్మాయిలు బైనాక్యులర్స్ లో ఎవరివైపో చూస్తున్నట్లున్న “గ్యాంగ్ లీడర్” మూవీ ఫస్ట్ లుక్ ప్రేక్షకులలో ఆసక్తిరేపుతుంది. హీరో గ్యాంగ్ లో ఉన్న ఐదుగురు సభ్యులు ఆడవారు కావడం ఒక విశేషం అయితే, ఆ ఐదుగురు వేరు వేరు వయసులువారు కావడం మరో విశేషం. ఓ బామ్మ తో పాటు, పదేళ్ల పాప, ఓ గృహిణి, ఇద్దరు యవతులు ఉన్నారు. బామ్మ తో ఉన్న మిగతా నలుగురు వరలక్ష్మి, ప్రియా,స్వాతి, చిన్ను అంటూ వారి పేర్లు కూడా నాని ట్విట్టర్ లో పంచుకున్నారు.

నాని ఇది రివెంజర్స్ గ్యాంగ్ అని హింట్ ఇస్తున్న నేపథ్యంలో ఈ టీమ్ కి ఎవరో ఒకరివలన తీవ్ర అన్యాయం జరిగింది అనిపిస్తుంది. ఓ ఎతైన భవనం పై నిలబడి సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్న ఆ టీమ్ అసలు ఎవరు? వారు అందరు ఒకే కుటుంబానికి, చెందినవారా లేక వేరునా? వారు ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు అనేది ఆసక్తికరం. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాని లుక్ కూడా కొంచెం పల్లెటూరి మాస్ కుర్రాడిలా ఉంది. ఏదిఏమైనా నాని “గ్యాంగ్ లీడర్” మూవీ ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెరిగేలా చేశాడు.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. తమిళ యంగ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తుండగా వచ్చే నెల 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More