తెలంగాణ యాస కోసం నాని ప్రత్యేక శిక్షణ..!

Published on Jul 28, 2021 3:00 am IST

నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ట‌క్ జ‌గ‌దీష్‌, శ్యామ్ సింగ‌రాయ్‌ సినిమాలు షూటింగులు పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం అంటే సుందరానికి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత నాని కథానాయకుడిగా సుధాకర్‌ చెరుకూరి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే తెలంగాణ నేపధ్యంలో ఈ కథను తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలోనే ఓ తెలంగాణ అబ్బాయిగా నాని పాత్ర‌ని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అందుకే తెలంగాణ యాసలో పట్టు సాధించాలని నాని ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని కూడా నియమించుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే గ‌తంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా కోసం నాని రాయ‌ల‌సీమ యాస నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం తెలంగాణ యాస నేర్చుకుంటున్న నాని ఎలా మెప్పిస్తాడో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :