“వి” మూవీ షూటింగ్ సెట్స్ లో నాని

Published on Aug 11, 2019 10:00 am IST

నాని తన 25వ చిత్రం విలక్షణ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. “వి” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాని ఇంతకుమిందెన్నడూ చేయని ఓ విభిన్నమైన పాత్ర చేస్తున్నారని తెలుస్తుంది. నాని నెగెటివ్ షేడ్స్ కలిగిన సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నారని సమాచారం. హీరో సుధీర్ ఓ కీలక పాత్ర చేస్తుండగా, అదితిరావ్ హైదరి, నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

కాగా ఈ చిత్ర షూటింగ్ తాజా షెడ్యూలు నేడు ప్రారంభమైంది. హీరో నాని పాల్గొన్న ఈ షెడ్యూల్ లో దర్శకుడు కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. మరో విశేషం ఏమిటంటే నాని ఈమూవీలో తన సిక్స్ ప్యాక్ అవతార్ చూపించనున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు “వి” చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

ఇక నాని తాజాగా నటించిన ” గ్యాంగ్ లీడర్” మూవీ వచ్చే నెల13న విడుదల కానుంది. ఈ మూవీలో నాని పెన్సిల్ అనే పెన్ నేమ్ కలిగిన రివేంజ్ డ్రామా రైటర్ గా కనిపించనున్నారు. దర్శకుడు విక్రమ్ కుమార్ రొమాంటిక్ కామెడీ మరియు యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More