మరో మారు నిర్మాతగా మారనున్న నాని.

Published on May 28, 2019 11:00 pm IST

దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో నాని నిర్మాత‌గా మారి “అ” అనే ప్ర‌యోగాత్మ‌క మూవీని నిర్మించి ప్ర‌శంస‌లు పొందాడు.అలాగే మరో సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ‘ఫలక్ నుమా దాస్’ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చిన నాని, ఇదే హీరోతో తన సొంత బ్యానర్ అయిన ‘వాల్ పోస్టర్’పై ఒక సినిమాను నిర్మించనున్నట్టు చెప్పాడు.

ప్రస్తుతం తాను ‘గ్యాంగ్ లీడర్’, ‘వి’ సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నాననీ, ఈ రెండు ప్రాజెక్టులు ఒక కొలిక్కి వచ్చిన తరువాత నిర్మాతగా తన తదుపరి సినిమా మొదలవుతుందని తెలిపాడు.

సంబంధిత సమాచారం :

More