నాని గర్వంగా ఫీల్ అవుతున్నారట

Published on Aug 10, 2019 10:59 am IST

తన నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన “అ” మూవీ నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో రెండు అవార్డులు గెలుచుకోవడంతో నాని ఆనందం వ్యక్తం చేశారు. మా నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ మొదటి ప్రయత్నంగా తెరకెక్కించిన “అ” చిత్రానికి రెండు జాతీయ అవార్డ్స్ రావడం చాలా గర్వంగా భావిస్తున్నాము. ఈ చిత్రంలో నటించిన నటులకు, పని చేసిన సాంకేతిక నిపుణులకు,మా మూవీని అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు, ఆలాగే అవార్డులు గెలుచుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా ప్రశాంత్ వర్మ దర్శకుడిగా తెరకెక్కించిన “అ” అనే ప్రయోగాత్మక చిత్రాన్ని హీరో నాని తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్ పై స్వయంగా నిర్మించారు. ఒక వ్యక్తిలోని విభిన్న వ్యక్తిత్వాలను ఒక్కొక్క పాత్రగా మలచి విలక్షణ రీతిలో తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రసంశలు అందుకుంది.నిన్న ప్రకటించిన జాతీయ అవార్డులలో బెస్ట్ మేకప్,మరియు వి ఎఫ్ ఎక్స్ విభాగాలలో ఈ చిత్రం రెండు అవార్డులను సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్ ఈ మూవీలో ప్రధాన పాత్రలో కనిపించగా నిత్యా మీనన్,ఈషా రెబ్బా,మురళి శర్మ,రెజీనా, ప్రియదర్శి ఇతర కీలక పాత్రలలో కనిపించారు.

సంబంధిత సమాచారం :