ఫైనల్ టచ్ కు రెడీ అయ్యిన “టక్ జగదీష్”.!

Published on Dec 4, 2020 8:14 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు పలు ఆసక్తికర ప్రాజెక్టులను టేకప్ చేసిన సంగతి తెలిసిందే. తన కెరీర్ లో మైల్ స్టోన్ సినిమా అయినటువంటి “వి” డిజిటల్ గా ఆకట్టుకోకపోయినా నాని నటనకు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. ఇక దీనితో నాని చేసే నెక్స్ట్ సినిమాలపైనే అందరి కళ్ళు పడ్డాయి.

వాటిలో నాని 26వ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న “టక్ జగదీష్” పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇపుడు ఈ చిత్రం షూట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసిందట. లేటెస్ట్ గా మేకర్స్ ఈ చిత్రం తాలూకా ఫైనల్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో మెయిన్ లీడ్ క్యాస్ట్ అంతటితో ప్రారంభించారట.

కొన్ని రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ పూర్తయ్యాక వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానుంది. ఇక ఈ చిత్రంలో నాని సరసన టాలెంటెడ్ హీరోయిన్స్ రీతూ వర్మ అలాగే ఐశ్వర్య రాజేష్ లు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని డీసెంట్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More