రూమర్స్ మళ్ళీ క్లియర్ చేసిన “టక్ జగదీష్”.!

Published on May 27, 2021 1:01 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “టక్ జగదీష్”. నాని హిట్ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అయితే ఈ చిత్రం కూడా ఈ కరోనా సెకండ్ వేవ్ మూలాన విడుదల ఆగాల్సి వచ్చింది. గత ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం వాయిదా పడిపోయింది.

దీనితో ఈ గ్యాప్ లోనే ఈ చిత్రం ఓటిటి విడుదల అని టాక్ తాజాగా అదంతా అవాస్తవం అని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ అవే రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉండటంతో మేకర్స్ స్ట్రిక్ట్ గా ఈ చిత్రం కేవలం థియేటర్స్ లోనే విడుదల అవుతుందని ఓటిటిలో నో ఛాన్స్ అని తేల్చి చెప్పేసారు. సో ఈ చిత్రం థియేటర్స్ లో మాత్రమే విడుదల అవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :