స్మోకింగ్ కంటే నాని చాలా డేంజర్ అంట

Published on Feb 18, 2020 1:29 pm IST

నాని లేటెస్ట్ మూవీ ‘వి’ వచ్చే నెల 25న ఉగాది కానుకగా విడుదల కానుంది. విడుదలకు చాలా సమయం ఉంది. అయినప్పటికీ చిత్ర ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు చిత్ర బృందం. నిన్న ఈ చిత్ర టీజర్ విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. కళ్ళు చెదిరే యాక్షన్ సీన్స్, చేజింగ్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ అద్భుతంగా ఉంది. టీజర్ లో బీజీఎమ్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక ఈ టీజర్ ఇప్పటికే యూ ట్యూబ్ లో 3మిలియన్ వ్యూస్ దాటివేసింది.

కాగా ట్విట్టర్ ద్వారా తన మూవీ ప్రమోషన్స్ చేస్తున్నాడు హీరో నాని. స్మోక్ చేస్తూ కిల్లర్ గెటప్ లో సీరియస్ గా ఉన్న తన ఫోటో పోస్ట్ చేసి..’స్మోకింగ్ కిల్స్, కానీ కింద స్మోక్ చేస్తూ ఉన్న వాడు ఇంకా వేగంగా చంపేస్తాడు.. ‘ అని ఓ సీరియస్ కొటేషన్ పెట్టారు. వి మూవీలో తన పాత్ర ఎంత డేంజరస్ గా ఉంటుందో చెప్పకనే చెవుతున్నాడు నాని. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతం అందించారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More