‘నాని’ విలనే.. కానీ ఎమోషనల్ !

Published on May 23, 2019 3:00 am IST

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు కలిసి ఓ మల్టీ స్టారర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి, నివేత థామస్ కథానాయికలుగా నటించనున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు.

అయితే నాని పాత్ర నెగిటివ్ టచ్ తో కాస్త వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఇంచుమించుగా కర్ణుడి పాత్రను పోలి ఉంటుందట. స్నేహం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చెయ్యాల్సి వస్తోందట. మొత్తానికి క్యారెక్టర్ నెగిటివ్ టచ్ ఉన్నప్పటికీ.. చాలా ఎమోషనల్ గా ఉంటుందని సమాచారం. డిసెంబర్ చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.

సంబంధిత సమాచారం :

More