మరో సారి వైవిధ్యమైన పాత్రలో నాని ?

Published on Oct 16, 2018 11:15 am IST


ఒకే తరహా చిత్రాల్లో నటించి గతంలో విమర్శలు ఎదుర్కున్న స్టార్ హీరో నాని ఇటీవల తన పంథాను మార్చుకున్నాడు. దాంట్లో భాగంగా ఇటీవల ‘దేవదాస్’ చిత్రంతో మెప్పించిన ఆయన ‘జెర్సీ’ అనే చిత్రానికి సన్నద్ధం అవుతున్నాడు. ఈచిత్రంలో నాని క్రికెట్ ఆటగాడిగా నటించనున్నారు. విజయదశమికి ఈచిత్ర షూటింగ్ ప్రారంభం కానుండగా ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ , రెబా మోనికా జాన్ కథానాయికలుగా నటించనున్నారు. గౌతమ్ తెరకెక్కించే ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

ఇక ఈచిత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే నాని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు కిశోరుడు చెప్పిన కథ నాని కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈచిత్రంలో నాని రైతు పాత్రలో కనిపిస్తాడట. అయితే ఈవార్తలను అధికారికంగా ద్రువీకరించాల్సి వుంది.

సంబంధిత సమాచారం :