డిజిటల్ ప్రీమియర్ గా నాని “అంటే సుందరానికి”…ఎప్పుడంటే?

డిజిటల్ ప్రీమియర్ గా నాని “అంటే సుందరానికి”…ఎప్పుడంటే?

Published on Jun 22, 2022 9:00 PM IST

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి అందర్నీ ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నజ్రియా ఫహద్ కథానాయిక గా నటించింది. రొమాంటిక్ కామెడీ చిత్రం త్వరలో డిజిటల్‌ ప్రీమియర్ గా ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 8, 2022న ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. అయితే, దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రోహిణి, నరేష్, నదియా, రాహుల్ రామకృష్ణ, పృథ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు