లేటెస్ట్ : నాని ‘దసరా’ హిందీ వర్షన్ స్ట్రీమింగ్ అప్ డేట్

Published on May 18, 2023 8:10 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ దసరా. ఇటీవల పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న దసరా మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇక అటు థియేటర్స్ లో సూపర్ హిట్ కొట్టిన దసరా మూవీ, ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో పలు భాషల్లో అందుబాటులోకి వచ్చి బుల్లితెర ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది.

అయితే హిందీలో మాత్రం ఈ మూవీ అందుబాటులోకి రాకపోవడంతో పలువురు నార్త్ ఫాన్స్ దీని కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కాగా వారికి తాజాగా ఒక గుడ్ న్యూస్ అయితే లభించింది. దసరా మూవీ హిందీ వర్షన్ ని మే 25 నుండి తమ ఆడియన్స్ కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు నెట్ ఫ్లిక్స్ వారు తాజాగా అనౌన్స్ చేసారు. దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, సముద్రఖని, పూర్ణ, ఝాన్సీ తదితరులు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :