విడుదలకు సిద్దమైన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ టైటిల్ సాంగ్ !
Published on Nov 19, 2017 4:21 pm IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని ప్రస్తుతం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే సినిమా చేస్తున్నాడు. చివరి దశ పనుల్లో ఉన్న ఈ సినిమా యొక్క టీజర్ కూడా ఇటీవల విడుదలై మంచి
స్పందన దక్కించుకుంది. దానికి తోడు నానికి జోడీగా ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి నటిస్తుండటంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న విడుదలచేయాలని నిర్ణయించిన టీమ్ ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. వాటిలో భాగంగానే రేపు 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఆల్బమ్ లోని టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు కాబట్టి మ్యూజికల్ గా కూడా ఈ చిత్రంపై మంచి హోప్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు. నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

 
Like us on Facebook