నాని సినిమాకు డీసెంట్ సాటిలైట్ బిజినెస్!

నాని సినిమాకు డీసెంట్ సాటిలైట్ బిజినెస్!

Published on May 21, 2015 5:07 PM IST

Yevade-Subramanyam
నాని హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సెల్ఫ్ డిస్కవరీ సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక్ దత్ నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా విడుదలై డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు మంచి రివ్యూలతో పాటు ఏ సెంటర్లలో, మల్టీప్లెక్స్‌లలో సూపర్ హిట్‌ టాక్ వచ్చింది.

మూడు భిన్న వ్యక్తిత్వాలున్న వ్యక్తులు హిమాలయ కొండల్లో చేసే ప్రయాణంగా తెరకెక్కిన ఈ సినిమా విజువల్స్ ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ప్రముఖ టీవీ చానెల్ జెమినీ, ఈ సినిమా సాటిలైట్ హక్కులను సుమారు 3.90కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సినిమాలకు సంబంధించి సాటిలైట్ మార్కెట్ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. అయితే పెద్ద సినిమాలు, క్రేజీ సినిమాలు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ మంచి సాటిలైట్ ధర పలకడం కనిపిస్తోంది. ఆ లైన్లో ఎవడో సుబ్రమణ్యం సినిమా మంచి సాటిలైట్ ధరకు అమ్ముడుపోవడం నాని సినిమాకున్న క్రేజ్‌ను బయటపెట్టింది.

తాజా వార్తలు