‘గూఢచారి’ పై యువ మంత్రి ఆసక్తికరమైన ప్రశంసలు !

Published on Aug 6, 2018 8:38 am IST

నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన్న చిత్రం ‘గూఢచారి’. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన టాక్ తో విజయవంతంగా దూసుకెళ్తోంది. చిన్న చిత్రం అయినా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాంకేతిక విలువలతో వివిధ ఎక్కువ లొకేషన్స్ లో సినిమాను అత్యుత్తమంగా రూపొందించారు. దాంతో ఈ సినిమా చూసి సామాన్య ప్రేక్షకులతో పాటు సెలెబ్రేటిస్ కూడా థ్రిల్ అవుతున్నారు. హై టెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ను ఇస్తుందని అందరూ చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు.

కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేష్ కూడా ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురింపించారు. ‘స్ర్పై థ్రిల్లర్ గా వచ్చిన గూఢచారి చిత్రాన్ని చూసి బాగా ఎంజాయ్ చేశాను. సాంకేతిక నిపుణులతో పాటు ఆర్టిస్టులు కూడా చాలా కష్టపడ్డారు. అడవి శేష్, శోభిత ధూళిపాళ, ప్రకాశ్ రాజ్, శశికిరణ్ మరియు మిగిలిన కీలకమైన నటీనటులు మొత్తం మంచి ఎఫర్ట్ పెట్టారు. వారందరికీ నా అభినందనలు’’ అని తన ట్వీటర్ వేదికగా తెలిపారు. ఇక ఈ చిత్రం అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై అభిషేక్ నామా, టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More