విలక్షణ సినిమాలతో తెలుగులో తనదైన బాణీని సెట్ చేసుకున్న హీరో నారా రోహిత్, ఈ ఏడాది ‘అసుర’ అందించిన విజయంతో వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీబిజీగా మారిపోయారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘సావిత్రి’, ‘పండగల వచ్చాడు’ ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతోన్న రోహిత్, కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమా టాకీపార్ట్‌ను పూర్తి చేశారు. తమిళంలో మంచి విజయం సాధించిన మాన్ కరాటే సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
శ్రీ కీర్తి ఫిలిమ్స్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నారా రోహిత్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించి ఆకట్టుకోనున్నారు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ అందించిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో జిల్ సినిమా ద్వారా పరిచయమైన కబీర్ సింగ్ విలన్‌గా నటిస్తోండగా, లతా హెగ్దే హీరోయిన్గా నటిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తైన సందర్భంగా నిర్మాతలు సినిమా ఔట్‌పుట్‌పై నమ్మకం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆడియో రిలీజ్ జరపనున్నట్లు స్పష్టం చేశారు.


