హీరో నారా రోహిత్ తాజాగా నటిస్తోన్న సినిమా ‘బాలకృష్ణుడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా, మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. నారా రోహిత్ సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్న ఈ సినిమాలో రెజీనా కథానాయిక. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకురానుంది. నవంబర్ 10న ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లో జరుపనున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ ఆడియో వేడుకలో పాల్గొనున్నారు.
ఈ సినిమాతో దర్శకుడిగా మారిన పవన్ మల్లెల ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా వినోదం తో కూడిన లవ్ స్టొరీని తెరకెక్కించినట్లు సమాచారం. నారా రోహిత్ ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటాడని ఆశిద్దాం. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాకు కోలుసు రాజా మాటలు అందించారు.
