వారి అంచనాలు ఖచ్చితంగా మార్చేసిన ‘నారప్ప’, ‘వకీల్ సాబ్’ లు

Published on Jul 22, 2021 7:08 am IST

ప్రతీ సినిమా ఇండస్ట్రీలో కూడా పలువురు బడా స్టార్ హీరోస్ కెరీర్ లో రీమేక్ చిత్రాలు అనేవి సర్వ సాధారణం అని తెలిసిందే. అయితే ఇన్నాళ్ల వరకు కూడా ఇప్పుడు ఉన్నంత స్థాయి రీచ్ సినిమాలకి ఉండేది కాదు. అంటే ఇతర భాషల్లో సినిమాలో జెనరల్ ఆడియెన్స్ దగ్గర వరకు వెళ్లే స్థాయి చాలా తక్కువే ఉండేది. అందుకే ఓ మంచి సబ్జెక్ట్ సినిమాని రీమేక్ చేసినా పెద్దగా తెలిసేది కాదు కానీ ఇప్పుడు మాత్రం ఎంటర్టైన్మెంట్ స్పాన్ బాగా పెరగడంతో అని భాషల సినిమాలు కూడా ప్రతీ ఒక్కరు చూడడం స్టార్ట్ చేశారు.

దీనితో రీమేక్స్ పై చాలా వరకు ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. దీనితో ఇక అలాంటి సినిమాలు ఎవరు చూస్తారు అనే వారి అభిప్రాయాలను లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” మరియు విక్టరీ వెంకటేష్ ల “నారప్ప” సినిమాలు ప్రూవ్ చేశాయని చెప్పాలి. కరెక్ట్ గా రీమేక్ ని రాసుకుని ప్రెజెంట్ చేస్తే ఖచ్చితంగా ఆదరిస్తారని ఇవి ప్రూవ్ చేసాయి.

ముందు రీమేక్ అనే రిమార్క్ ని పక్కన పెట్టి సాలిడ్ మౌత్ టాక్ ని ఈ రెండు చిత్రాలు కూడా సంతరించుకోవడం విశేషం. సినిమా ఎందులో విడుదల అయ్యింది అనే అంశం పక్కన పెడితే అంతిమంగా ఎలాంటి ఆదరణ అందుకున్నాయి అన్నదే మెయిన్ పాయింట్.. ఆ ప్రకారం ఈ రెండు సినిమాలు కూడా ఆడియెన్స్ ఆదరణ అందుకొని రీమేక్స్ పై కొందరికి ఉన్న అంచనాలు ఖచ్చితంగా మార్చాయని చెప్పి తీరాలి.

సంబంధిత సమాచారం :